- జడ్ ప్లస్ భద్రత కొనసాగించాలని వైఎస్సార్‌సీపీ నేత కన్నబాబు డిమాండ్
- జగన్‌కు ప్రజాదరణ పెరగడం చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శ
మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జడ్ ప్లస్ భద్రత అంశంపై కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు తీవ్రంగా స్పందించారు. వైఎస్ జగన్ భద్రతపై తమ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుందని, యధావిధిగా భద్రత కొనసాగించాలని కన్నబాబు కోరారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలో జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ ప్రజాదరణ చూసి ప్రధాన మంత్రి పదవి కాంక్షించేవారు తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. జగన్ మిర్చి రైతులను పరామర్శిస్తే తప్పుడు కేసులు పెడతారా? అని ప్రశ్నించిన కన్నబాబు, ఎన్నికల కోడ్ మీ మ్యూజికల్ నైట్‌కు ఎందుకు అడ్డంకి కాలేదని చంద్రబాబును నిలదీశారు. జగన్ రైతులను కలుసుకున్న తర్వాతే చంద్రబాబులో చలనం వచ్చింది అంటూ విమర్శలు గుప్పించారు.





