
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల కలెక్టర్ల మరియు పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “కలెక్టర్లు, మంత్రులు, పనితీరు ప్రామాణికంగా ఉండాలి” అని స్పష్టం చేశారు చంద్రబాబు. “మీ పనితీరు బాగోకపోతే, నేను మీమ్మల్ని పక్కన పెడతాను” అని హెచ్చరించారు. ఆయన ఆర్నెల్లకోసారి పనితీరు మదింపు చేస్తానని చెప్పారు. “ప్రజల్లో సంతృప్తి మన అంతిమ లక్ష్యం” అని ఆయన అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలను భాగస్వాముల్ని చేయాలని సూచిస్తూ, “అయితే వారు చెప్పిన పనులన్నీ చేయాల్సిన అవసరం లేదు” అని అన్నారు. “రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలన్నది నా లక్ష్యం” అని చంద్రబాబు స్పష్టం చేశారు. “ప్రజల తీర్పును నిలబెట్టుకోవడానికి బాధ్యత మాపై ఉంది” అని ఆయన అన్నారు.





