రిపీటే!!: డిన్నర్ కి బదులు ‘బ్రిన్నర్’!! Breakfast For Dinner

సన్ డే కాబట్టి ఇంత రిలాక్స్ గా న్యూస్ చదువుతున్నారు… అదే వీక్ డేట్స్ లో అయితే? మోగుతున్న అలారం ని నాలుగైదు సార్లు స్నూజ్ చేసి.. లేట్ గా లేవడం.. హడీవిడిగా రెడీ అవ్వడం.. ఆగమేఘాల మీద ఆఫీస్ కి చేరుకోవడం. ఈ మొత్తం స్క్రీన్ ప్లే మధ్యలో తిన్నమా? లేదో గుర్తుకు రాని బ్రేక్ ఫాస్ట్.. అది కూడా అయితే ఇడ్లీ లేకపోతే దోస.. గట్టిగా మాట్లాడితే.. ట్రాఫిక్ మధ్యలో ఒకటి రెండు బ్రడ్ స్లైస్ లు.. ఆ తర్వాత ఆకలి కోసం కడుపు నింపుకునే లంచ్ బ్రేక్.  అందరితో పాటు వేడి వేడి గాసిప్స్ నడమ.. చల్లారిపోయిన లంచ్. ఇక ఈవినింగ్ ఇంటి బెల్లు మోగగానే.. జారిపోయినా భుజాలు.. నీరుగారిపోయిన ఆటిట్యూడ్ తో ఇంటికి స్టార్ట్.. అప్పుడే నైట్ ఏం తిందాం?  అని ఫోన్ తీస్తారు.  వేళ్లే మో స్విగ్గీ, జొమాటో పైకి.. మనసేమో వాటిలోని మెనూలపైకి వెళ్తుంది. స్వైప్ చేసి.. చేసి.. కన్ఫ్యూజన్.. చివర్లో ఏదో ఒకటి ఆర్డర్ పెట్టేయడం. పార్సిల్ కలెక్ట్ చేసుకుని తినేయడం.. అంతేనా? ఆగండాగండీ.. ఇదే మంత పద్ధతి కాదంటున్నారు పోషకాహార నిపుణులు.  అంతేకాదు.. రజనీకాంత్ లా ‘రిపీటే!!’ అంటూ లైఫ్ స్టైల్ లో కొత్త మార్పుని శ్రీకారం చుట్టమని సూచనిస్తున్నారు. మరోవైపు మానసిక నిపుణులు కూడా ఒత్తడికి ఇదో ఉపశమనం అంటున్నారు. ఇంతకీ ఈ ‘రిపీటే!’ ఫార్ములా ఏంటి?  సింపుల్.. ఉదయం హడావిడిగా చేసిన బ్రేక్ ఫాస్ట్ ని నైట్ ప్లాన్డ్ గా.. రిలాక్స్ గా.. రిపీట్ చేయడం.. అదే బ్రిన్నర్. ఓస్.. ఇంతేనా? అనుకోద్దు.. ఈవిగో ఈ ఫార్మెట్ లని ఫాలో అయిపోండి అంటూ న్యూట్రీషియన్స్ చిట్కాలు చెబుతున్నారు. లెట్స్ స్టార్ట్!!!

లైట్ గా పొట్టలోకి.. ఫుల్ గా పోషకాలు ఒంట్లోకి!! 
నేటి తరంలో ఏ ఇద్దరి మధ్య కన్వర్నేషన్ విన్నా.. డైట్ లో కార్బ్స్ తగ్గించాలి డ్యూడ్… అనే. అందుకే నైట్ తినే ఫూడ్ లో నైనా అది రిపీట్ కాకుండా చూసుకోవాలి అంటున్నారు పోహకాహార నిపుణులు.  ఎందుకంటే.. ఉదయం క్విక్ గా తినేసే బ్రేక్ ఫాస్ట్ లేని పోషకాల్ని… కానీసం ఈ రిపీట్ ఐటమ్ లోనైనా ప్లాన్ చేయాలి.  బౌల్ నిండుగా లోడెడ్ విజిటేబుల్స్ తో ఏ పోహానో ఊహించండి అంటున్నారు  ఆహార నిపుణులు. క్విక్ గా స్టార్ట్ చేసిన డేటాని.. కూల్ గా హెల్తీగా ముగిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు.  అందుకే ఏం తినాలో ‘రిపీట్ ’లో ముందే ప్లాన్ చేసుకోవాలి.  పుష్టికరమైన ప్రోటీన్ ప్యాక్ ని పొట్టలోకి లైట్ పంపేయాలి.  పరోటాలు, పూరిలు లాంటి హేవీ ఫుడ్స్ కి మాత్రం దూరంగా ఉంటే మంచిది. ఉదయం అల్పాహారంలోనూ ఎప్పుడైనా స్పెషల్ డేస్ లో నే ఈ కార్బ్ ఫుడ్స్ ని ఆరగిస్తే ఒకే. 

ఇలాగైతే సస్పర్ ‘స్పెషల్’ 
రాత్రి సమయంలో రోజూ చేసే సంప్రదాయ డిన్నర్ కి భిన్నంగా ప్లాన్ చేసుకునేదే ఈ రిపీట్ బ్రిన్నర్.  ఆలోచిస్తే ఈ రిపీట్ మెనూలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయ్. తక్కువ ఖర్చుతో త్వరగా కుక్ చేసుకోవచ్చు.. ముఖ్యంగా తక్కువ కాలరీలతో కడుపుకి హాయిగా అనిపించేలా తినొచ్చు. కిచిడి, ఉప్మా, పోహా, హోల్ గ్రెయిన్ సెర్రల్స్, వోట్స్.. లాంటివి చక్కని ఆప్షన్స్ అని న్యూట్రీషియన్స్ సూచిస్తున్నారు.  కాస్త ప్రోటీన్ యాడ్ చేయాలనుకుంటే.. ఓ ఆమ్లెట్ లేదా పన్నీర్ ని జోడించాలని చెబుతున్నారు.  ఒత్తడి లైఫ్ స్టైల్ లో నలిగిపోయే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి ఈ బ్రిన్నర్ లైఫ్ స్టైల్ ని ఫాలో అవ్వొచ్చు. దీంతో కిచెన్ లో ఎక్కువ సమయాన్ని గడపాల్సిన అవసరం ఉండదు. కంపుల్స్ ఇద్దరూ కలిసి కుక్ చేసుకోవచ్చు.  ఇలా ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ తో అలవాటు చేసుకుంటే బ్రిన్నర్  ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.  

లెట్స్ బిగిన్ బ్రిన్నర్
ఎప్పుడైనా పోషకాహార నిపుణులు ఏం చెబుతారంటే.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఎంత హెవీగా తిన్నా ఫర్వాలేదుగానీ.. రాత్రి పూట డిన్నర్ మాత్రం లైట్ గా ఉండాలి. ఈ బ్రిన్నర్ కాన్సెప్ట్ కూడా అదే.  టేబుల్ పై లైట్ గా అనిపించే బ్రేక్ ఫాస్ట్ ని పెట్టుకోవడం.  కార్బోహైడ్రేట్స్ ని లైట్ గా ఉండేలా ఫుడ్ పోర్షన్ ఉండాలి.  పీచు పదార్థాలు ఉండేలా జాగ్రత్త పడాలి. మరో ముఖ్యమైన విషయం ఎంటంటే.. షుగర్ సెర్రల్స్, పేస్ట్రీల్ని  దూరం పెట్టాలి.  ఒకవేళ మీకు ఇష్టం అయితే ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ప్రయత్నించొచ్చుగానీ.. రాత్రి బ్రిన్నరలో మాత్రం స్ట్రిక్ట్ గా నో చెప్పాల్సిందే. అప్పుడే ఉదయం యాక్టీవ్ నిద్ర లేవవడంతో పాటు.. రోజుని చలాకీగా స్టార్ట్ చేయొచ్చు.  బ్రిన్నర్ ప్రధాన ఉద్దేశం ఒక్కటే.. డే మొత్తం మీద బ్యాలెన్స్ డైట్ తీసుకోవడమే. ముఖ్యంగా రాత్రి పూట జంక్ లేదా అవుట్ సైట్ ఫుడ్ కి నో చెప్పడమే. సో.. బిజీ వర్క్ షెడ్యూల్స్ లో లెట్స్ బిగిన్ బ్రిన్నర్ లైఫ్ స్టైల్!!! 

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *