మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలానికి చెందిన సుభాష్(22), హైదరాబాద్ కూకట్పల్లి జేఎన్టీయూలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. అయితే, కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినా తల్లిదండ్రులకు పాస్ అయ్యానంటూ అబద్ధం చెప్పాడు. ఈ విషయం నిజం తెలిస్తే తల్లిదండ్రులు ఏమంటారోనని లోలోపలే తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు.ఈ క్రమంలో సోమవారం సుభాష్ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుమారుడు ఆత్మహత్య చేసుకున్న వార్తతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.





