హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సంధ్య థియేటర్ ఘటనపై నేషనల్ మీడియాపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు చెప్పారు. ఈ ఘటనపై మీడియా ప్రశ్నలు అడిగినప్పుడు ఆయన సహనాన్ని కోల్పోయినట్లు తెలిపారు. “ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. ప్రెస్మీట్లో రెచ్చగొట్టే ప్రశ్నలు వేయడంతో నేను కాస్త సహనాన్ని కోల్పోయాను. పరిస్థితులు ఎలా ఉన్నా సంయమనం పాటించాల్సి ఉంటుంది” అని ఆయన పేర్కొన్నారు. సీవీ ఆనంద్ మాట్లాడుతూ, “నేను చేసిన వ్యాఖ్యలు పొరబాటుగా భావిస్తున్నాను. నేషనల్ మీడియాపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా. క్షమాపణలు కోరుతున్నా” అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై ఆయన విడుదల చేసిన వీడియోలో, థియేటర్లో జరిగిన సంఘటనల వివరాలను వెల్లడించారు.





