సాంకేతికత, ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ), సంగీత ప్రపంచాన్ని గొప్పగా ప్రభావితం చేస్తోంది. గాయకుడి అవసరం లేకుండా పాటలు సిద్ధమవుతున్నాయి. అయితే, ఈ పాటలు హృదయాలను తాకాలంటే మనిషి స్పర్శ అవసరమని ప్రముఖ సంగీత దర్శకుడు రమణ గోగుల ఓ సందర్భంగా తన మనసులో భావాల్ని పంచుకున్నారు. విజయవంతమైన ఎన్నో పాటలకు స్వరాలు సమకూర్చిన రమణ గోగుల వెంకటేశ్, పవన్ కళ్యాణ్ వంటి కథానాయకులతో కలిసి పనిచేశారు. ఇటీవల, ఆయన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని “గోదారి గట్టుమీద” పాటను మధుప్రియతో కలిసి ఆలపించారు.ఈ సందర్భంగా రమణ గోగుల మాట్లాడుతూ, “నా సినిమాల్లోని పాటలే పాడాను, కానీ ఈ పాటలో నాకు సృజనాత్మక స్వేచ్ఛ దొరికింది” అని చెప్పారు. “సాంకేతికత ఎంత ఉన్నా, పాటలో సోల్ కనిపించాలి” అని పేర్కొన్నారు.





