నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ హాజరు: రెగ్యులర్‌ బెయిల్ కోసం పిటిషన్!!

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో నేడు నాంపల్లి కోర్టుకు ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌ హాజరుకానున్నారు. పుష్ప2 ప్రీమియర్‌ షో సమయంలో జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌ పై కేసు నమోదైందన్న విషయం తెలిసిందే. నాంపల్లి కోర్టు ఈ కేసులో అల్లు అర్జున్‌కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌ విధించింది. రిమాండ్‌ సమయంలో బన్నీ చంచల్‌గూడ జైలుకు తరలించబడ్డారు. హైకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది, కానీ నాంపల్లి కోర్టు వద్ద రెగ్యులర్‌ బెయిల్ కోసం పిటిషన్ వేయాలని సూచించింది.

ఈ రోజు, అల్లు అర్జున్‌ తరఫు న్యాయవాదులు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ విషయాన్ని నాంపల్లి కోర్టులో ప్రకటించనున్నారు. అలాగే, రెగ్యులర్‌ బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. సంధ్య థియేటర్‌ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు, ఆమె కుటుంబానికి పుష్ప2 టీమ్‌ రూ.2 కోట్ల సాయం అందించింది. అల్లు అర్జున్‌ తరపున రూ.1 కోటి, నిర్మాతలు, దర్శకుడు సుకుమార్‌ చెరో రూ.50 లక్షలు అందించారు. ఇక రేవతి కుమారుడు శ్రేతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొలుకుంటున్నాడు, అతని ఆరోగ్యం మెరుగుపడిందని వైద్యులు తెలిపారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *