ప్రధానిగా ప్రస్థానం: అనుకోని మలుపు,ఆయన్నే ఎన్నుకుంది!!

మన్మోహన్‌ సింగ్‌ జీవితంలో 2004 సంవత్సరం అత్యంత ముఖ్యమైన మలుపుగా నిలిచింది. ఆ సంవత్సరంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ కూటమి మెజారిటీ సాధించినా, ప్రధాన మంత్రి పదవిపై అనూహ్య సమస్యలు తలెత్తాయి. సోనియా గాంధీ విదేశీయత అంశంపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో, కాంగ్రెస్‌ పార్టీలోనే అశాంతి చోటు చేసుకుంది.

సోనియాగాంధీ త్యాగం
తనపై వచ్చిన విమర్శల కారణంగా సోనియా గాంధీ ప్రధాన మంత్రి పదవిని స్వయంగా త్యాగం చేశారు. ఆ పదవి కోసం ప్రణబ్‌ ముఖర్జీ వంటి అనేక మంది కాంగ్రెస్‌ దాదాలు పోటీ పడినప్పటికీ, సోనియా మాత్రం మన్మోహన్‌ సింగ్‌ను ఎంపిక చేశారు. ఆయన సౌమ్య స్వభావం, పరిజ్ఞానం, మరియు గతంలో ఆర్థిక సంస్కరణల్లో చేసిన కృషి ఆమెకు నమ్మకాన్ని కలిగించాయి.

దేశ 13వ ప్రధానిగా ఎంపిక
ఆ విధంగా అనుకోకుండా దేశ 13వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్‌ సింగ్‌ అనేక అంచనాలను అధిగమించి, దేశంలో తన ముద్ర వేశారు. ఆయన ప్రధానిగా కొనసాగిన పదేళ్లు (2004-2014) భారత రాజకీయాల్లోనే కాదు, ఆర్థిక రంగంలో కూడా స్వర్ణయుగం లాగా నిలిచాయి.

పదేళ్ల నిరాఘాట పాలన
అత్యున్నత పదవిలో పదేళ్లపాటు నిరాఘాటంగా కొనసాగిన మన్మోహన్‌ సింగ్‌ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. దేశ ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నడిపించడంలో, గ్రామీణ అభివృద్ధి పథకాలు, సాంకేతిక విప్లవాల అమలులో ఆయనది ముఖ్యపాత్ర. మన్మోహన్‌ ప్రస్థానం అనుకోకుండా ప్రారంభమైనా, ఆయన అందించిన సేవలు భారతదేశ చరిత్రలో ఓ విశిష్ట అధ్యాయంగా నిలిచిపోతాయి.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *