యండగండి పార్శిల్ మర్డర్ మిస్టరీ ఏమయ్యింది? శ్రధర్ వర్మే నిందితుడా!?

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో సంచలనం సృష్టించిన డెడ్ బాడీ పార్శిల్ కేసులో ప్రధాన నిందితుడు శ్రీధర్ వర్మను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. విచారణలో విచిత్రమైన నిజాలు వెలుగుచూశాయి. హత్యకు నిందితుడి మూడో భార్య సుష్మ, పదేళ్ల కుమార్తె సహకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఆస్తి కోసం ఘోర కుట్ర

శ్రీధర్ తన వదిన తులసి ఆస్తిని దక్కించుకోవడానికి మూడో భార్య సుష్మతో కలిసి దారుణ హత్యకు పూనుకున్నాడు. వదినను భయపెట్టడానికి ముందుగా శవాన్ని ఎక్కడైనా సంపాదించాలనుకున్నారు. అది సాధ్యంకాకపోవడంతో ఒంటరిగా ఉంటున్న పర్లయ్యను మద్యం తాగించి, కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, నైలాన్ తాడు ఉపయోగించి హత్య చేశారు.

శవాన్ని చెక్కపెట్టెలో పంపిణీ

హత్య తర్వాత పర్లయ్య శవాన్ని చెక్కపెట్టెలో పెట్టి గాంధీనగర్‌లో తులసి ఇంటికి పంపారు. శవం చూసి భయపడిన తులసిని బెదిరిస్తూ, ఆస్తి పత్రాలపై సంతకం చేయాలని నిందితులు ఒత్తిడి చేశారు.

పోలీసులకు సమాచారం, నిందితుడి పరారీ

తులసి తన ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో పోలీసులు కేసులోకి ప్రవేశించారు. నిందితుడు శ్రీధర్ వర్మ తన మూడో భార్య సుష్మ, కుమార్తెతో కలిసి పారిపోయాడు. పలు ప్రాంతాల్లో గాలించి, బంటుమిల్లి మీదుగా మంగినపూడి బీచ్‌కు చేరుకున్నట్లు గుర్తించారు. పర్లయ్యను దారుణంగా హత్య చేసిన శ్రీధర్ వర్మకు ఉరిశిక్ష విధించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

అరెస్ట్ సమయంలో బయటపడ్డ వివరాలు

  • శ్రీధర్ వర్మ 40కి పైగా సిమ్ కార్డులు ఉపయోగించాడు.
  • బ్యాంకు ఖాతాల్లో రూ.2 కోట్లు ఉన్నట్లు గుర్తించారు.
  • నివాసంలో క్షుద్రపూజల ఆనవాళ్లు బయటపడ్డాయి.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *