ఆస్ట్రేలియా గడ్డపై నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) ప్రత్యేకమైన రికార్డు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా జట్టులో చోటు సంపాదించిన నితీశ్, ఆస్ట్రేలియాతో జరుగుతున్న మెల్బోర్న్ టెస్టులో తన నైపుణ్యాన్ని పూర్తిగా నిరూపించాడు. భారత జట్టును ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించడమే కాకుండా, 171 బంతుల్లో అద్భుత శతకం నమోదు చేశాడు. ఈ క్రమంలో గతంలో నితీశ్ పంచుకున్న ఇష్టాలు వైరల్ అవుతున్నాయ్. తన ఫేవరేంట్ సాంగ్ ఏంటి? అని అడగ్గా.. ‘నాకు ఇష్టమైన పాట జాని సినిమాలో ‘నారాజ్ కాకురా మా అన్నయ్యా!!’ సాంగ్’ అని చెప్పారు. తనకి ఆ బీట్ అంటే ఎంతో ఇష్టమాన్నారు. అంతేకాదు.. ఆ పాటలో ఎంతో ఎనర్జీ, ఫలాసఫీ ఉందని పాడి వినిపించారు. నిజంగానే ఆ పాటలో లిరిక్ మాదిరిగా.. ‘మన రోజు మనకుంది’ అన్నట్టుగా.. ఈ రోజు నితీశ్ దే!!





