కదిరి ప్రజలకు కందికుంటకు 2024 లక్కీ ఇయర్. గతంలో కందికుంట గెలిచినప్పుడు ప్రభుత్వం అధికారంలో లేదు.. కందికుంట ఓడినప్పుడు పైన ప్రభుత్వం ఉండేది. అయితే కదిరి ప్రజలతో పాటు కందికుంటకు 2024లో లక్కీ ఇయర్ అని చెప్పాలి. కందికుంట ఎమ్మెల్యేగా గెలవడం.. అటు కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో 20 ఏళ్లలో కదిరిలో ఎప్పుడూ జరగనంత అభివృద్ధి జరుగుతుందన్న ఆశలతో కదిరి ప్రజలు ఉన్నారు.
2014లో కందికుంట ఎమ్మెల్యేగా గెలవకపోయినా.. కదిరికి మెగా సోలార్ ప్లాంట్ రావడంలో కందికుంట చక్రం తిప్పారు. ప్రభుత్వం అధికారంలో ఉండడంతో కదిరలో నిరుపయోగంగా ఉన్న బంజరు భూములను ఉపయోగంలోకి తీసుకు రావడంతో పాటు అక్కడ నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం – కందికుంట భుజాల మీద వేసుకుని ఈ ప్లాంట్ రప్పించారు.
- అలాగే హంద్రినీవా పనులు యుద్ధ ప్రాతిపదికన తీసుకువచ్చి కదిరికి ప్రాంతానికి నీళ్లు వచ్చేలా చేశారు.
- కదిరి ముస్లిం సోదరులతో చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి పెరిగిన నేత కావడంతో సొంత నిధులతో షాదీమహాల్ నిర్మించారు.
- కందికుంట నారాయణమ్మ ట్రస్ట్ ద్వారా కందికుంట నారాయణమ్మ ట్రస్ట్ ద్వారా వందల మంది పిల్లలకు ఉచిత విద్య అందిస్తున్నారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే 20 ఏళ్లకు పైగా విస్తృతమైన సేవా కార్యక్రమాలు నిరాటంకంగా చేస్తున్నారు.
- నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీలో ఖచ్చితంగా ఓ గుడి కట్టించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి పల్లెకు తాగునీటి ఎద్దడి లేకుండా ప్రతి పంచాయతీలోనూ బోర్లు వేయిస్తున్నారు. గత 25 ఏళ్లుగా ఇది మహా యజ్ఞంలా కొనసాగుతోంది.
- ప్రహ్లాద సమేత శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహా స్వామి వారి దేవస్థానం అభివృద్ధి కోసం.. ఉత్సవాల కోసం ఆలయ ముస్తాబు లాంటి కార్యక్రమాలను సెట్ చేసిన ఘనత కందికుంట వెంకట ప్రసాద్దే.
- నియోజకవర్గంలో 25 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని మండల కేంద్రమైన నంబుల పూలకుంట రహదారి నిర్మాణాన్ని మొన్న గెలిచిన నెల రోజులకే పనులు ప్రారంభించారు.
- కందికుంట సొంత నిధులతో కొన్ని వేల మందికి వైద్య సేవలు అందించారు.
రాష్ట్రంలోనే చేనేత సామాజిక వర్గం నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్. 2019 తర్వాత అప్పుడు అధికారంలో ఉన్న బలమైన సామాజిక వర్గం ఆయన్ను అణగదొక్కేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా… రోడ్డెక్కి పోరాటాలు చేసి మరీ సక్సెస్ అయ్యి కదిరిలో టీడీపీ జెండా ఎగరవేసేలా సక్సెస్ అయ్యారు.





