పెద్దూరుకు చెందిన అరుణ తన భర్తపై దాడి చేసి, అతన్ని నడిరోడ్డుపై ఉరేసిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. మద్యం మత్తులో ఉన్న భర్త అమరేంద్రబాబు (38) మంగళవారం తన భార్య వద్దకు వచ్చి గొడవ పడ్డాడు. అరుణ, భర్త తనను చంపేస్తాడన్న ఉద్దేశంతో అతని తలపై కర్రతో బలంగా కొట్టింది. కిందపడ్డ అమరేంద్రకు తాడు కట్టి, నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చి మెడకు ఉరి బిగించి హత్య చేసింది. ఈ దారుణాన్ని వీడియో తీసి, సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో విషయం వెలుగుచూసింది. నిందితురాలైన అరుణ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
కర్ణాటకలో మరో దారుణం
ఇక కర్ణాటకలో, శ్రీమంత ఇట్నాళె అనే వ్యక్తి తన భార్యను వేధించిన తరువాత, ఆమె అతన్ని చంపి ముక్కలు చేసింది. సావిత్రి తన భర్తను బండరాయితో కొట్టి హత్య చేసి, శవాన్ని ముక్కలు చేసి ప్లాస్టిక్ డ్రమ్ములో వేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
- భర్త వేధింపులు: సావిత్రి, తన కుమార్తెపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన భర్తను చంపడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంది.
- స్థానికుల ఫిర్యాదు: పొలంలో పడి ఉన్న మృతదేహం ముక్కలను చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనలు ఆలోచింప చేస్తున్నాయ్!!
ఈ రెండు ఘటనలు భారతదేశంలో మహిళలపై జరుగుతున్న హింసను మరియు కుటుంబంలో జరిగే వేధింపులను తెలియజేస్తున్నాయి. ఈ సంఘటనలు మహిళల ఆరోగ్యానికి మరియు ఆర్థిక స్వాతంత్రానికి ఎంతటి హాని తలపెడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంతటి హీన స్థితికి మధ్యానికి బానిసైన మగాడు చేస్తున్నాడంటే.. ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి. కౌన్సెలింగ్ సెంటర్ల ద్వారా ఇలాంటి పరిస్థితుల్ని అధిగమించొచ్చు.






