వాట్ నెక్స్ట్ దేవరా?: ప్రశాంత్ నీల్ తో మరో పాన్ ఇండియా సినిమా షురూ!!

గతేడాది భారీ విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్‌ ‘దేవర’ తర్వాత బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌తో కలిసి ‘వార్‌ 2’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం చివరిదశకు చేరుకుంది. తారక్‌ ఈ నెలలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసే అవకాశముంది. అదే సమయంలో ఆయన తదుపరి చిత్రం పై దృష్టిపెట్టారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ మైత్రీ మూవీస్‌ మరియు ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థల సంయుక్త నిర్మాణంలో రూపొందనున్న ఈ పాన్‌ ఇండియా చిత్రం ఈ నెల మూడో వారంలో కర్ణాటకలో షూటింగ్‌ను ప్రారంభించనుంది.

ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో ఎన్టీఆర్‌ తన కెరీర్‌లోనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో ఆయనకు జోడీగా రుక్మిణీ వసంత్‌ నటించనున్నట్లు సమాచారం. ఎన్టీఆర్‌ వచ్చే నెల సెట్స్‌లోకి అడుగుపెడతారని తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్‌ చిత్రం 2025 జనవరి 9న విడుదల కానుంది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *