ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడి: 9 జవాన్ల మృతి

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌ జిల్లా అటవీ ప్రాంతంలో సోమవారం మావోయిస్టులు మందుపాతర పేల్చి 9 జవాన్లను హతమార్చగా, మరో 5 మంది గాయపడ్డారు. అంబోలి వంతెన వద్ద భద్రతా బలగాల వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిపారు. గాయపడిన జవాన్లను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇటీవలి కాలంలో బీజాపూర్‌, సుక్మా ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రాబల్యం పెరుగుతుండటంతో భద్రతా బలగాలు అప్రమత్తమవుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇటీవల నక్సలిజంపై ఉక్కుపాదం మోపుతున్నామని ప్రకటించిన నేపథ్యంలో ఈ దాడి జరుగడం గమనార్హం.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *