కర్ణాటక, గుజరాత్లో హ్యూమన్ మెటానిమో వైరస్ (HMPV) కేసులు నమోదైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రానికి వైరస్ వల్ల ముప్పు లేదని ఐసీఎంఆర్ ఇప్పటికే స్పష్టం చేసినప్పటికీ, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
ప్రతిఘటనకు సర్వ సిద్ధం
‘‘వైరస్‌పై వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించాం. అవసరమైన వైద్య పరికరాలు, యాంటీ డ్రగ్ డోస్‌లు సిద్ధంగా ఉంచాం. పరీక్షల కోసం ల్యాబ్‌లను సన్నద్ధం చేశాం. నూతన ప్రోటోకాల్ అమలు చేస్తున్నాం’’ అని మంత్రి వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు.





