తెదేపా నేతలు బొండా ఉమా మహేశ్వరరావు, బుద్దా వెంకన్నలపై దాడి కేసులో నిందితుడైన తురకా కిశోర్‌ను మాచర్ల జూనియర్ సివిల్ కోర్టు 14 రోజుల రిమాండ్‌కు పంపింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడైన కిశోర్‌ను ఆదివారం హైదరాబాద్‌లో అరెస్టు చేసిన ఏపీ పోలీసులు, కోర్టులో హాజరుపరిచారు. కోర్టు విచారణ అనంతరం రెండువారాల రిమాండ్ విధించింది.
తెదేపా నేతలపై జరిగిన దాడిలో
మాచర్ల నియోజకవర్గంలో జరిగిన రాజకీయ హింసకు సంబంధించి కిశోర్‌పై మూడు హత్యాయత్నాలు, ఇతర కేసులు నమోదయ్యాయి. గత స్థానిక ఎన్నికల సందర్భంగా తెదేపా నేతలపై జరిగిన దాడిలో కిశోర్ కీలకంగా వ్యవహరించాడు. బొండా ఉమ, బుద్దా వెంకన్నలపై కర్రలు, కత్తులతో దాడి చేసిన వీడియోలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకొని మాచర్లకు తరలించారు.





