విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కలిసి రోడ్ షోలో పాల్గొనడం, బహిరంగ సభ నిర్వహించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకత సంతరించుకుంది. ఈ వేదిక నుంచి రైల్వే జోన్, హైవే ప్రాజెక్టులు, తిరుపతిలో క్రిస్‌సిటీ వంటి కీలక పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. రోడ్ షో సందర్భంగా విశాఖ నగరం సందడి వాతావరణాన్ని సంతరించుకుంది. కూటమి పార్టీలు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ రోజు ప్రముఖలు షెడ్యూల్ ఇలా ఉండబోతోంది..
ఈ రోజు షెడ్యూల్!!!
- 4.15 PM: ప్రధాని మోదీ విశాఖ ఐఎన్ఎస్ డేగాకు ప్రత్యేక విమానంలో చేరుకోనున్నారు.
- 4.45 PM: సిరిపురం కూడలి నుంచి ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం వరకు ముగ్గురూ కలిసి రోడ్ షోలో పాల్గొంటారు.
- 5.30-6.45 PM: బహిరంగ సభలో ప్రసంగాలు, వర్చువల్ విధానంలో పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.
- అనంతరం: ప్రధాని భువనేశ్వర్ వెళ్లి, చంద్రబాబు, పవన్‌కల్యాణ్ విజయవాడకు బయలుదేరి వెళ్తారు.






