సినిమాల్లో పాత్రలపై రాజేంద్ర ప్రసాద్‌ వివరణ: ‘నా మాటల్ని వక్రీకరించారు!’

ఈ మధ్య కాలంలో విడుదల అవతున్న సినిమాల్లో హీరో పాత్రల గురించి తన వ్యాఖ్యలను వక్రీకరించారని సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ‘షష్టిపూర్తి’ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ఆయన, తన మాటలను సోషల్ మీడియాలో తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు.

‘‘పుష్ప 2’’ హీరో పాత్రపై మాటలు వక్రీకరణ

‘‘సమాజంలోని వ్యక్తుల జీవితాలను తెరపై ప్రతిబింబించే ప్రయత్నమే సినిమాలు. నేను అల్లు అర్జున్‌ను కలిసినప్పుడు నా వ్యాఖ్యల గురించి మాట్లాడుకున్నాం. ఆన్‌లైన్‌లో వచ్చిన పోస్ట్‌లు చూసి నవ్వుకున్నాం. సోషల్ మీడియా అంశాలను ప్రతిసారి నెగెటివ్ కోణంలో చూడకూడదు,’’ అని రాజేంద్ర ప్రసాద్‌ తెలిపారు. ఆయన తన సినిమాలు ‘లేడీస్ టైలర్’, ‘అప్పుల అప్పారావు’ వంటి చిత్రాలను ఉదాహరణగా ప్రస్తావించారు.

పద్మ అవార్డు గురించి స్పందన

రాజేంద్ర ప్రసాద్‌ను విలేకరులు పద్మ అవార్డు గురించి అడగగా, ఆయన ఇలా స్పందించారు… ‘‘రామోజీ రావు గారు ఓసారి నన్ను ‘ పద్మ అవార్డు వచ్చిందా? ఎందుకు ప్రయత్నించలేదు?’ అని అడిగారు. కానీ ఆయన వెంటనే నువ్వు పద్మశ్రీ కంటే గొప్ప యాక్టర్ వి’ అని అన్నారు. ఆయన మాటలు నాకు పద పద్మ అవార్డుల ఆనందం ఇచ్చాయి. ఆ అవార్డు రాలేదని ఎప్పుడూ బాధపడలేదు,’’ అని స్పష్టం చేశారు.

‘షష్టిపూర్తి’ సినిమా వివరాలు

రాజేంద్ర ప్రసాద్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్ ప్రభాస్‌ దర్శకత్వంలో రూపేశ్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రం తల్లిదండ్రుల పెళ్లిని చూడాలనుకున్న పిల్లల కథతో రూపొందుతోంది. టీజర్ విడుదల సందర్భంగా మాట్లాడుతూ, నేటితరం ప్రేక్షకులకు ఈ కథ బాగా కనెక్ట్ అవుతుందని రాజేంద్ర ప్రసాద్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.