ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం చేరుకున్నారు. సీఎం చంద్రబాబు, ఉన్నతాధికారులు ఆయనకి ఘన స్వాగతం పలికారు. విశాఖలో రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమాల్లో రైల్వే జోన్, పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్‌లకు శంకుస్థాపన చేయడం విజిట్ లోని ముఖ్య అంశాలు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి భారీ రోడ్ షోలో పాల్గొననున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. విశాఖలో పర్యటన సందర్భంగా భద్రతను మరింత బలపరిచేందుకు భారీగా పోలీసులు మొహరించారు. ప్రజల రవాణా సౌకర్యానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసి, పర్యటనను విజయవంతం చేయడానికి అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు.





