గేమ్‌ ఛేంజర్‌: తొలి రోజు భారీ కలెక్షన్లు.. అప్పన్న, రామ్‌ నందన్‌ పాత్రలపై చిరంజీవి స్పందన!!

శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ ప్రధాన పాత్రలో నటించిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తొలిరోజు రూ.47 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచే రూ.38 కోట్లు వచ్చినట్లు సమాచారం. బుక్‌ మై షో ద్వారా 1.3 మిలియన్లకు పైగా టికెట్లు విక్రయమైనట్లు సంస్థ వెల్లడించింది. వారాంతంలో ఈ సినిమాకు మరింత ఆదరణ లభించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.

రామ్‌ చరణ్‌ నటనపై ప్రశంసలు

రామ్‌ చరణ్‌ ‘అప్పన్న’ పాత్రలో అద్భుతంగా నటించారని పలువురు ప్రశంసిస్తున్నారు. ‘‘అప్పన్న, రామ్‌ నందన్‌ పాత్రలతో చరణ్‌ మన్ననలు పొందడం గర్వకారణం’’ అంటూ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఉపాసన, సాయి ధర్మతేజ్‌ తదితరులు కూడా రామ్‌ చరణ్‌ నటనను మెచ్చుకున్నారు. ఈ చిత్రంలో కియారా అడ్వాణీ, అంజలి, ఎస్‌.జె. సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌ ముఖ్య పాత్రలు పోషించారు. తమన్‌ సంగీతం అందించారు. అయితే, ‘నానా హైరానా’ పాట సాంకేతిక కారణాల వల్ల తొలగించగా, జనవరి 14 నుంచి సినిమాకు ఈ పాటను జోడిస్తామని చిత్రబృందం ప్రకటించింది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *