గోదావరి జిల్లాలో చలిపులి ఒకవైపు.. పల్లె ప్రజల సంక్రాంతి సందళ్ల మరో వైపు.. మంచు పల్లకిలో భోగి సంగళ్లు ఊరూరా ఊరేగుతున్నాయి… ఆదివారం అర్ధరాత్రి నుంచే భోగి మంటల వెలుగులు ప్రారంభమయ్యాయి. వెచ్చని రవికిరణాల్ని అందుకోవడానికి ముందే, భోగి మంటల సెగ పల్లె ప్రజలను వెచ్చగా నిద్ర లేపుతోంది!!
సంక్రాంతి ముందస్తు సందడి
పల్లె, పట్టణాల్లో సంక్రాంతి వేడుకల జోష్ కనిపిస్తోంది. రంగవల్లులతో ముగ్గులు, పూర్వ విద్యార్థుల కలయికలు, కుటుంబ సమ్మేళనాలు పండగకు కొత్త అందాన్ని తీసుకొచ్చాయి. ఏలూరు, తణుకు, భీమవరం, పాలకొల్లు వంటి ప్రాంతాల్లో స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థలు ముందస్తు సంబరాలు నిర్వహించారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండటంతో బస్టాండ్లు సందడిగా మారాయి. పల్లె ప్రజలు బంధుమిత్రులతో కలిసి భోగి, సంక్రాంతి, కనుమ వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.





