ప్రపంచ నాయకులుగా తెలుగు ప్రజలు ఎదగాలి!!: సీఎం చంద్రబాబు

ప్రపంచంలోని అన్ని దేశాల్లో తెలుగు ప్రజల ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్విట్జర్లాండ్‌లో జ్యూరిక్‌లో జరిగిన ‘స్విస్‌ తెలుగు డయాస్పోరా’ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఐరోపాలోని 12 దేశాల నుంచి తెలుగువారు పాల్గొన్న ఈ సమావేశంలో చంద్రబాబు, ప్రపంచ స్థాయి నాయకులుగా తెలుగు ప్రజలు ఎదగాలని ఆకాంక్షించారు.

కర్మభూమి, జన్మభూమికి మద్దతుగా నిలవాలి

‘‘తెలుగువారు కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. మీరున్న ప్రదేశం కర్మభూమి. కానీ, జన్మభూమి అభివృద్ధి కోసం మీ సహకారం అవసరం. ఇక్కడి కంపెనీలకు అవసరమైన మానవ వనరులను మేము అందిస్తాం. ప్రపంచ స్థాయి నాయకులుగా ఎదిగేలా తెలుగువారిని తీర్చిదిద్దడానికి ఒక ప్రత్యేక ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాం’’ అని చంద్రబాబు వివరించారు. ఐరోపాలో తెలుగు ప్రజల అభివృద్ధి అవకాశాలపై రూపొందించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *