రోడ్డు ప్రమాదాల నివారణకు కర్ణాటక ట్రాఫిక్ పోలీసులు వినూత్న చర్యలు తీసుకుంటున్నారు. వీరి తాజా పని సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు పొందుతోంది. రహదారిపై అతిగా హారన్ వినియోగించిన ఓ బస్సు డ్రైవర్‌ను పట్టుకున్న పోలీసులు, అతడి బస్సు ముందే కూర్చోబెట్టి, ఆ హారన్‌ని శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో ప్రాక్టికల్ గా చూపించాడు. అతిగా హారన్ వినియోగం ప్రజలపై ఎలా ప్రభావం చూపుతుందో డ్రైవర్‌కు ప్రత్యక్షంగా చూపించారు. శబ్ద భరించలేకపోయిన డ్రైవర్‌కు ‘‘మీరు హారన్ కొట్టినప్పుడు ప్రజల పరిస్థితి ఇలాగే ఉంటుంది’’ అని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై నెటిజన్లు పోలీసుల విధానాన్ని ప్రశంసిస్తూ ‘‘ఇలాంటి శిక్షలు మరిన్ని కావాలి’’ అంటున్నారు.





