ఏపీలో టైర్ తయారీ యూనిట్‌పై ఆలోచన: దావోస్‌లో నారా లోకేష్ చర్చ!!

టైర్ల తయారీలో ప్రపంచస్థాయిలో అగ్రగామి సంస్థగా ఉన్న అపోలో టైర్స్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ కన్వర్‌తో మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్‌లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆటోమోటివ్ పరిశ్రమ నేపథ్యంలో, రాష్ట్రంలో కొత్త టైర్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరియు, టైర్ టెక్నాలజీ ఆవిష్కరణలపై పరిశోధన కోసం ఆర్ అండ్ డి కేంద్రం ఏర్పాటుతో పాటు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక విద్యా సంస్థలతో భాగస్వామ్యాలు చేపట్టాలని కోరారు. మంత్రి విజ్ఞప్తులపై స్పందించిన నీరజ్ కన్వర్, ఏపీ ప్రభుత్వ సూచనలపై చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. దావోస్ సదస్సు ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న కృషి పై లోకేష్ ప్రత్యేకంగా తెలిపారు. నాలెడ్జ్ ఎకానమీకి దోహదం చేసే పరిశ్రమలు, యువతకు ఉపాధి కల్పించే అవకాశాలు, పరిశ్రమల విస్తరణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వివరించారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *