ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం భీంపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి విద్యార్థి బన్నీ (14) ఖోఖో ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. ఈ ఘటన గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో ఆటలు ఆడిస్తున్న సమయంలో జరిగింది.బన్నీని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. బాలుడు గతంలో గుండె సంబంధిత చికిత్స చేయించుకొని, స్టెంట్లు వేసినట్లు సమాచారం. ఈ విషాద సంఘటన పాఠశాలకు చెందిన విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల మధ్య తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.





