తెలంగాణ రాష్ట్రం ప్రపంచ ఆర్థిక ఫోరంలో కీలక ఒప్పందాలతో చరిత్ర సృష్టించింది. దావోస్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని బృందం రాష్ట్రానికి సుమారు రూ. 1.78 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 49,550 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయి.
16 ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు
- సన్ పెట్రో కెమికల్స్
- భారీ పంప్డ్ స్టోరేజీ హైడ్రో విద్యుత్తు, సోలార్ విద్యుత్తు ప్లాంట్లు
- 3400 మెగావాట్ల హైడ్రో విద్యుత్తు, 5440 మెగావాట్ల సోలార్ విద్యుత్తు
- పెట్టుబడి: రూ. 45,500 కోట్లు
- ఉపాధి: 7,000 మందికి
- అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS)
- ఏఐ, క్లౌడ్ డేటా సెంటర్లలో భారీ పెట్టుబడులు
- పెట్టుబడి: రూ. 60,000 కోట్లు
- కంట్రోల్ ఎస్ (CtrlS)
- అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్లస్టర్
- 400 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్
- పెట్టుబడి: రూ. 10,000 కోట్లు
- ఉపాధి: 3,600 మందికి
దావోస్‌లో తెలంగాణ సత్తా
ప్రపంచ స్థాయిలో తెలంగాణ ప్రతిష్ఠను పెంచుతూ, భారీ పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఈ ప్రాజెక్టుల అమలుతో తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికవేత్తలకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుతోంది.






