16 ఏళ్ల అంకిత్ ఛటర్జీ చరిత్ర సృష్టించాడు: సౌరవ్ గంగూలీ రికార్డు బద్దలు!!

రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌లో బెంగాల్ యువ క్రికెటర్ అంకిత్ ఛటర్జీ ఆరంగేట్రంతో క్రికెట్ ప్రపంచంలో సంచలనం రేపాడు. 16 ఏళ్ల వయసులో సౌరవ్ గంగూలీ 35 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతూ, బెంగాల్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.

సౌరవ్ గంగూలీ రికార్డు బద్దలు

బెంగాల్ మరియు హర్యానా జట్ల మధ్య కళ్యాణిలో జరిగిన రంజీ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో అంకిత్ చరిత్ర సృష్టించాడు. 15 సంవత్సరాలు, 361 రోజులు మాత్రమే ఉన్న అంకిత్, 1990లో 17 ఏళ్ల వయసులో ఆరంగేట్రం చేసిన సౌరవ్ గంగూలీ రికార్డును అధిగమించాడు. విశేషం ఏమిటంటే, జనవరి 27న తన 16వ పుట్టినరోజు ముందు ఈ ఘనత సాధించాడు. అంకిత్ ఛటర్జీ క్రికెట్ పట్ల తన నిబద్ధతను జూనియర్ టోర్నమెంట్‌లలోనే నిరూపించాడు. వినూ మన్కడ్ ట్రోఫీ 2024లో 42 సగటుతో 376 పరుగులు చేసిన అంకిత్, కూచ్ బెహార్ ట్రోఫీ 2024లో 41 సగటుతో 325 పరుగులు సాధించాడు. ఈ 10వ తరగతి విద్యార్థి తన అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత క్రికెట్‌కు భవిష్యత్ స్టార్ అని నిరూపించుకున్నాడు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *