- కొన్ని సినిమాలు సమాజంలో స్ఫూర్తి కలిగిస్తాయి, అయితే కొన్ని క్రైమ్‌లకు ప్రేరణగా మారుతున్నాయి.
- ఇటీవల మీర్పేట్ మాధవి హత్య కేసులో ఓటీటీలో విడుదలైన సినిమా ప్రభావం
సినిమాల ప్రభావం సమాజంపై చాలా ఉంటుంది. కొన్ని సినిమాలు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తాయి, మంచి చేయడానికి ప్రేరణగా ఉంటాయి. కానీ, కొన్ని సందర్భాల్లో అవి మిస్ ఫైర్ అవుతుంటాయి. ఈ మధ్యకాలంలో సినిమాలు, సిరీస్‌ల ప్రభావంతో చాలా క్రైమ్‌లు జరుగుతున్నాయి. ఇటీవల మీర్పేట్ మాధవి హత్య అలా జరిగిందని పోలీసుల ఇన్విస్టిగేషన్ తో తెలుస్తోంది . ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. క్షణికావేశంలో జరిగిన హత్యను కప్పి పుచ్చేందుకు నిందితుడు ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయిన సూక్ష్మదర్శిని అనే మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రేరణ పొందినట్టు ఇన్వెస్టిగేషన్లో తేలింది. గురుమూర్తి అనే నిందితుడు తన భార్య మాధవిని హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు.గతంలో కూడా సినిమాల ప్రభావంతో కొన్ని నేరాలు చోటు చేసుకున్నాయి.. ఇప్పుడు మీర్పేట్ కేసు కూడా అలాంటి ఉదాహరణగా నిలుస్తోంది. గురుమూర్తి శవాన్ని మాయం చేయడానికి యాసిడ్లు మరియు రసాయనాలను వినియోగించినట్టు గుట్టు విప్పాడు. ఈ విధంగా శవాన్ని మాయం చేయడం, అలా చేయడం క్రమంలో నిందితుడు ఒక్కడే ఇంట్లోనే ఉన్నాడు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రక్తపు మరకలను గుర్తించడం సాధ్యమైంది, ఇది ఈ కేసులో కీలకమైన అంశంగా మారింది.






