ఏపీలో ఉచిత ఇంటి స్థలాలు: మహిళల పేరిట ఇంటి పట్టాలు!!

ఉచిత నివాస స్థలాలు: మహిళల పేరిట ఉచిత నివాస స్థలాల పట్టాలను అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అర్హతలు: ఈ పథకం బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే వర్తించనుంది.

రాష్ట్ర ప్రభుత్వం ఉచిత నివాస స్థలాల పట్టాలను మహిళల పేరిట అందజేస్తామని ప్రకటించింది. పట్టణాల్లో 2, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలకు మాత్రమే ఈ పట్టాలు అందజేయబడతాయని తెలిపారు. గత మంత్రివర్గ సమావేశంలో ‘అందరికీ ఇళ్లు’ పథకం అమలుకు ఆమోదం తెలిపిన మేరకు ప్రభుత్వం నివాస స్థలాల పంపిణీపై జీఓ-23ను జారీ చేసింది.

ముఖ్య నిబంధనలు ఇలా..!!

  • ఉచిత నివాస స్థల పట్టా: అర్హులకు జీవితకాలంలో ఒకసారే ఉచిత నివాస స్థల పట్టా అందజేస్తారు.
  • అర్హతలు: లబ్ధిదారులు రాష్ట్రంలో మరెక్కడా సొంత స్థలం లేదా ఇల్లు ఉండకూడదు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గృహ పథకాల్లో లబ్ధి పొంది ఉండకూడదు.
  • భూమి పరిమితి: లబ్ధిదారుకు అయిదెకరాల మెట్ట లేదా 2.5 ఎకరాలకు మించి మాగాణి భూమి ఉండకూడదు.
  • ఈ పథకం క్రింద పొందిన స్థలాలకు 10 సంవత్సరాల అనంతరం యాజమాన్య హక్కులు ఇవ్వబడతాయి.
  • గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన స్థలాలు, లేఅవుట్లలో లబ్ధిదారులు నిర్మాణానికి ఆసక్తి చూపకుంటే వాటిని రద్దు చేస్తారు. శ్మశానాలకు దగ్గరగా, ముంపు సమస్యలు ఉన్న కేటాయింపులను రద్దు చేయడానికి కలెక్టర్లకు అధికారాన్ని ఇచ్చారు.

స్థలాల ఎంపికకు ప్రత్యేక నిబంధనలు

  1. ప్రభుత్వ స్థలాలు లేదా అవసరానికి మించి ఉన్న భూములను కేటాయిస్తారు.
  2. ప్రత్యేక పరిస్థితుల్లోనే ప్రైవేట్‌ భూములను కొనుగోలు చేస్తారు.
  3. ఎసైన్డ్ భూముల యజమానులకు నష్టపరిహారం చెల్లించి భూములను సేకరిస్తారు.
  4. దాతలు ఉచితంగా భూములు ఇవ్వడానికి ముందుకొస్తే వాటిని పరిగణనలోకి తీసుకుంటారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *