57 ఏళ్ల ఉపాధ్యాయురాలిని ఆన్‌లైన్ లోన్ కోసం మభ్యపెట్టిన సైబర్ నేరగాడు రూ.5.50 లక్షలు వసూలు… నిందితుడు ఆమె నుంచి పలు దఫాలుగా డబ్బు తీసుకుని, తిరిగి డిమాండ్ చేస్తుండటంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది!!
హైదరాబాద్‌కు చెందిన 57 ఏళ్ల ఉపాధ్యాయురాలు ఆర్థిక అవసరాల నేపథ్యంలో ఆన్‌లైన్‌లో లోన్ తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో, ఆమెను “మహేష్” అనే పేరుతో ఒక సైబర్ నేరగాడు సంప్రదించాడు. అతను ఆమె వివరాలను తీసుకుని, లోన్ ప్రాసెసింగ్ ఫీజు పేరుతో పలు దఫాలుగా రూ.5.50 లక్షలు తన సూచించిన ఖాతాల్లో జమ చేయించుకున్నాడు.ఎన్నిసార్లు డబ్బు ఇచ్చినా, అతను తిరిగి డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో ఆమె మోసపోయానని గ్రహించింది. దీంతో, ఆమె సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆన్‌లైన్‌లో లోన్‌లు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బు డిమాండ్ చేస్తే, నమ్మి మోసపోవద్దని వారు సూచిస్తున్నారు.





