రామ్‌చరణ్ ఈ సంక్రాంతి బరిలో గేమ్ ఛేంజర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేశారు. ఇప్పుడు ఆయనRC16 పై దృష్టి సారించారు, ఇది బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా.
ఈ చిత్రం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంస్థలతో కలిసి వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు.ఈ చిత్రం ఇప్పటికే మైసూర్‌లో ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. కొత్త షెడ్యూల్ బుధవారం నుండి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. రాత్రి వేళ సాగే ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్‌తోపాటు ప్రధాన తారలపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి “పెద్ది” అనే పేరు పరిశీలనలో ఉంది. కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, జగపతిబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.





