అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్‌కు వైట్‌హౌస్‌లో కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. మస్క్ నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE)కి ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు వైట్‌హౌస్‌లో కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. ఆయన ప్రకారం, మస్క్‌కు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయడం జరుగుతుందని కానీ అది ఓవల్ ఆఫీసులో కాదని స్పష్టం చేశారు. వైట్‌హౌస్ పశ్చిమవైపు ఉన్న Eisenhower Executive Office Buildingలో ఈ కార్యాలయం ఉంటుందని, ఇది ప్రభుత్వానికి సంబంధించిన వివిధ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను చర్చించేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మస్క్ తన బృందంతో కలిసి ఈ ఆఫీసులో పనిచేయడానికి 25 మంది సభ్యులను నియమించనున్నాడు.ఈ సమయంలో, మస్క్ ట్రంప్‌కు పూర్తిగా మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. గత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మస్క్, ట్రంప్ పాలకవర్గంలో DOGEకి సారథిగా నియమించబడ్డాడు. ఈ కొత్త విభాగం ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు మరియు ఖర్చులను తగ్గించడంపై దృష్టి సారించనుంది. అయితే, మస్క్ జోక్యం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.






