భారత జట్టు మంగళవారం రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20లో ఇంగ్లాండ్ జట్టుపై 26 పరుగుల తేడాతో ఓడింది. 172 పరుగుల లక్ష్య ఛేదనలో, టీమ్ ఇండియా 9 వికెట్లు కోల్పోయి కేవలం 145 పరుగులు మాత్రమే సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు సుమారు 426 రోజుల తర్వాత స్వదేశంలో ఓటమిని చవిచూసింది. ఇక్కడ టీమ్ ఇండియా ఓటమికి కారణాణ్ని అన్వేషిస్తే… టీమ్ ఇండియా పేసర్ షమీ 436 రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. కానీ, ఈ మ్యాచ్‌లో అతను అద్భుతంగా బౌలింగ్ చేయలేకపోయాడు. 3 ఓవర్లు వేసి 25 పరుగులు ఇచ్చి, ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. గత రెండు మ్యాచ్‌లలో అర్ష్ దీప్ వికెట్లు తీసి ఇంగ్లాండ్‌పై ఒత్తిడిని పెంచాడు, కానీ షమీ ఆ స్థాయిలో రాణించలేదు. సంజు శాంసన్ మూడో టీ20లో కూడా విఫలమయ్యాడు. జోఫ్రా ఆర్చర్ చేత అతను వికెట్ సమర్పించాడు. అతను కేవలం 3 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు, ఇది జట్టుకు మంచి ఆరంభం అందించడంలో విఫలమైంది.
లెఫ్ట్-రైట్ కాంబినేషన్‌కు ఎక్కువ ప్రాధాన్యం
భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో కూడా నిరాశపరిచాడు. భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో 14 పరుగుల వద్ద ఔటయ్యాడు, ఇది జట్టుకు పెద్ద నష్టం. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఒక ఓవర్ వేసి 15 పరుగులు సమర్పించాడు.. బ్యాటింగ్‌లో కూడా నిరాశపరిచాడు. అతను కేవలం 6 పరుగులు చేసి ఔటయ్యాడు, ఇది రన్ రేటును పెంచడానికి దోహదపడింది. బ్యాటింగ్ ఆర్డర్లో లెఫ్ట్-రైట్ కాంబినేషన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల బ్యాటర్లు సరైన రీతిలో పరుగులు చేయలేకపోయారు. శాంసన్ ఔటైన తర్వాత తిలక్ వర్మ రావాల్సి ఉన్నప్పుడు సూర్య వచ్చాడు, ఇది జట్టుకు నష్టాన్ని కలిగించింది.
Description: India suffered a defeat against England in the third T20 match in Rajkot. Here are five key reasons for Team India’s loss, including poor performances from key players like Shami and Samson.






