వాషింగ్టన్‌లో ఘోర విమాన ప్రమాదం: గాల్లోనే విమానం, హెలికాప్టర్ ఢీ!!

అమెరికాలోని వాషింగ్టన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 64 మందితో వెళ్తున్న ఓ ప్రయాణికుల విమానం, రక్షణ శాఖకు చెందిన ఒక హెలికాప్టర్‌తో ఢీకొన్నది. ఈ ఘటన బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో జరిగింది. పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం కాన్సాస్‌లోని విషిటా నుంచి బయల్దేరింది. వాషింగ్టన్ సమీపంలోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టుకు దిగేందుకు సిద్ధమవుతుండగా, సికోర్‌స్కీ హెచ్-60 బ్లాక్‌హాక్ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంతో రెండు వాహనాలు పోటోమాక్ నదిలో కూలిపోయాయి. ఘటనాస్థలంలో అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. విమానంలో 60 మంది ప్రయాణికులు మరియు నలుగురు సిబ్బంది ఉన్నారని సమాచారం. హెలికాప్టర్‌లో ముగ్గురు సైనికులు ఉన్నారు, కానీ వీఐపీలు లేరని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ప్రమాదంపై స్పందిస్తూ, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రాణాలు కోల్పోయిన వారిని ప్రార్థిస్తూ ట్వీట్ చేశారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *