పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధం!! నిర్మలమ్మ పద్దులు.. విపక్షాల విమర్శలు!

జనవరి 31న రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభం, ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి.. వక్ఫ్ సవరణ బిల్లుతో సహా 16 బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం, విపక్షాలు వివిధ అంశాలపై పోరాటానికి సిద్ధం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. మొత్తం 16 బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల రెండో విడత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనుంది. సమావేశాల ముందు అఖిలపక్ష భేటీ నిర్వహించిన కేంద్రం, విపక్షాలకు బిల్లుల వివరాలను అందజేసింది.ఇండియా కూటమి సభ్యులు నిరుద్యోగం, రైతుల సమస్యలు, వీఐపీ సంస్కృతి, మహా కుంభమేళా ఘటన, కచ్చతీవు వివాదం, ఒడిశాకు ప్రత్యేక హోదా వంటి అంశాలను సభలో లేవనెత్తనున్నారు. వక్ఫ్ బిల్లుపై పలు పార్టీలు బీజేపీ నివేదికను వ్యతిరేకిస్తున్నాయి.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *