తణుకులో ఎస్సై ఆత్మహత్య – సస్పెన్షన్‌ బాధతో తీవ్ర నిర్ణయం!!

గేదెల అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఎస్సై మూర్తి తుపాకీతో కాల్చుకుని బలవన్మరణం. ఇటీవల సస్పెండైన మూర్తి, తణుకు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆత్మహత్య

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఎస్సై ఎ.జి.ఎస్‌. మూర్తి శుక్రవారం ఉదయం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గేదెల అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా ఇటీవల ఆయన సస్పెండ్‌ అయ్యారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. తణుకు రూరల్‌ పీఎస్‌లో విధులు నిర్వహించిన మూర్తి, సస్పెన్షన్‌ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *