ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ ప్రాబ్లమ్ సరిచేద్దామనుకున్న విరాట్.. ఇన్‌స్వింగర్‌కు వికెట్ పడేశాడు.. 14 బంతుల్లో 6 పరుగులు చేసి పెవిలియన్ చేరిన కోహ్లీ.. రైల్వేస్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్ బౌల్డ్.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) రంజీ ట్రోఫీలో ఫామ్‌లోకి రావాలని భావించాడుగానీ, తొలి మ్యాచ్‌లోనే నిరాశ ఎదురైంది. ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బంతులను మెరుగుపర్చుకోవాలని ప్రాక్టీస్ చేసిన విరాట్, రైల్వేస్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్ (Himanshu Sangwan) వేసిన ఇన్‌స్వింగర్‌కు క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. రంజీ ట్రోఫీ (Ranji Trophy) లో ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన కోహ్లీ, కేవలం 14 బంతుల్లో 6 పరుగులకే వెనుదిరిగాడు. గుడ్ లెంగ్త్‌లో పడిన బంతి లోపలికి స్వింగ్ అవ్వడంతో కోహ్లీ మిస్ చేసి వికెట్లు పడేశాడు. అంతర్జాతీయ క్రికెట్లోనూ ఇటీవలి కాలంలో రిథమ్ కోల్పోయిన కోహ్లీ.. ఇప్పుడు ఇన్‌స్వింగర్లకు కూడా బలహీనత చూపిస్తున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






