భారత అమ్మాయిల హవా! అండర్-19 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా!!

ఇంగ్లండ్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ పోరు.. కమలిని (56*) అద్భుత అర్ధశతకంతో భారత్‌ 15 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.

ఇంగ్లండ్ (U19 Women England) నిర్దేశించిన 113 పరుగుల లక్ష్యాన్ని భారత ఓపెనర్లు ఆడుతూ పాడుతూ చేజిక్కించుకున్నారు. కమలిని-గొంగడి త్రిష (35) కలిసి తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించి జట్టుకు బలమైన పునాది వేశారు. త్రిష ఔటైన తర్వాత కమలిని సనికా చల్కేతో కలిసి భారత్‌ను 15 ఓవర్లలోనే గెలిపించింది.

బౌలర్ల విజృంభణ

భారత బౌలర్లు ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను పూర్తిగా నిలువరించారు. ఆయుషి శుక్లా (2/21), పరునిక సిసోదియా (3/21), వైష్ణవి శర్మ (3/23) చక్కని బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను 113 పరుగులకే పరిమితం చేశారు. డేవినా పెరిన్ (45) మినహా మిగతా బ్యాటర్లు భారత బౌలింగ్‌కు తలొగ్గారు. మరో సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా (U19 Women South Africa) ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఆదివారం భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *