ఓలా ఎలక్ట్రిక్‌ కొత్త స్కూటర్లు లాంచ్‌: ధరలు, స్పెసిఫికేషన్లు ఇదే!

జనరేషన్ 3 ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన నాలుగు మోడళ్లను విడుదల చేసిన ఓలా. టాప్ మోడల్‌ ఎస్‌1 ప్రో+ టాప్ స్పీడ్ 141 కి.మీ, ఐడీసీ రేంజ్ 320 కి.మీ.

విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) మూడోతరం జనరేషన్‌ ప్లాట్‌ఫామ్‌లో రూపొందించిన నాలుగు కొత్త స్కూటర్లను విడుదల చేసింది. ఎస్‌1 ఎక్స్‌, ఎస్‌1 ఎక్స్‌+, ఎస్‌1 ప్రో, ఎస్‌1 ప్రో+ అనే పేర్లతో లభించే ఈ స్కూటర్ల ధరలు రూ.79,999 నుంచి రూ.1,69,999 వరకు ఉంటాయి. టాప్ మోడల్ అయిన ఎస్‌1 ప్రో+ 5.3 kWh బ్యాటరీతో గంటకు 141 కి.మీ టాప్ స్పీడ్‌, 320 కి.మీ ఐడీసీ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్లలో డ్యూయల్ ABS, బ్రేక్‌ బై వైర్‌, హైపర్‌, స్పోర్ట్స్‌, నార్మల్‌, ఎకో మోడ్‌లు ఉన్నాయి. టాప్ వేరియంట్ ఎస్‌1 ప్రో+ ఇండస్ట్రియల్ సిల్వర్‌, జెట్ బ్లాక్‌, స్టెల్లర్ బ్లూ, మిడ్‌నైట్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. జనవరి 31 నుంచి ఆర్డర్లు అందుబాటులోకి వచ్చి, ఫిబ్రవరి రెండో వారం నుంచి డెలివరీలు మొదలవుతాయని కంపెనీ ప్రకటించింది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *