- వరుసగా ఎనిమిదోసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్
- మోరార్జీ దేశాయ్, చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ తర్వాత అత్యధిక సార్లు బడ్జెట్ సమర్పించిన మంత్రి.. ఇది భారత బడ్జెట్ చరిత్రలో నిర్మలా సీతారామన్ కొత్త మైలురాయి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు (2025-26) కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఒక విశేషమైన రికార్డు నెలకొల్పనున్నారు. వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్ సమర్పిస్తున్న తొలి మంత్రి, అలాగే మహిళా మంత్రిగా చరిత్రలో నిలిచారు. ఇప్పటివరకు మోరార్జీ దేశాయ్ (10 సార్లు), పి. చిదంబరం (9 సార్లు), ప్రణబ్ ముఖర్జీ (8 సార్లు) వంటి ప్రముఖులు ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రులుగా ఉన్నారు. కానీ వారెవరూ వరుసగా బడ్జెట్ సమర్పించలేదు. 2019లో మొదటి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా, అప్పటి నుంచి నిరంతరం బడ్జెట్ ప్రవేశపెడుతూ వస్తున్నారు.






