- పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం ప్రారంభం
- బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు
- కంది, మినుములు, మసూర్‌లను కొనుగోలు చేయనున్న కేంద్రం
- పండ్లు, కూరగాయల ఉత్పత్తికి నూతన పథకం
- అధికోత్పత్తి వంగడాల కోసం ప్రత్యేక జాతీయ మిషన్
- 2024 జులై నుంచి వందకుపైగా అధికోత్పత్తి వంగడాలు విడుదల
- పత్తి ఉత్పాదకత పెంపుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక మిషన్
- పత్తి రైతులకు మేలు చేసేలా దీర్ఘకాలిక లక్ష్యాలతో జాతీయ పత్తి మిషన్
“వ్యవసాయ రంగానికి కేంద్ర బడ్జెట్‌లో కొత్త ఊపు!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయరంగాన్ని మరింత బలోపేతం చేయడానికి పలు కీలక పథకాలను ప్రకటించారు. దేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తిని స్వయం సమృద్ధిగా మార్చే పథకం ప్రవేశపెట్టారు. పత్తి ఉత్పాదకతను పెంచేందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక మిషన్ ప్రకటించారు. దీని ద్వారా రైతులకు అధునాతన విత్తనాలు, సాగు పద్ధతులపై మార్గదర్శకాలు అందించనున్నారు. భారతదేశంలో పండ్లు, కూరగాయల ఉత్పత్తి పెంచేందుకు ప్రత్యేక ప్రోత్సాహక పథకం ప్రవేశపెట్టారు. బిహార్‌లో మఖానా ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనుంది.






