ఎస్సార్సీపీకి పార్టీ సభ్యల వీడ్కోలుపై జగన్, విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం!!

  • వైఎస్సార్సీపీకి రాజ్యసభ సభ్యుల రాజీనామాలపై జగన్‌ తొలిసారి స్పందన
  • వ్యక్తిత్వం, విశ్వసనీయత పాలిటిక్స్ లో ముఖ్యం అని వ్యాఖ్య

వైఎస్సార్సీపీకి నేతల ఒక్కొక్కరుగా వీడ్కోలు పలుకుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వసనీయత అత్యంత ముఖ్యం అని వ్యాఖ్యానించారు. కొందరు ప్రలోభాలకు లొంగి, మరికొందరు భయపడి తమ వ్యక్తిత్వాన్ని తక్కువ చేసుకుంటున్నారని విమర్శించారు. సాయిరెడ్డి సహా వెళ్లిపోయిన వారందరికీ ఇదే వర్తిస్తుందని అన్నారు. వైఎస్సార్సీపీ ఈరోజు ఉన్న స్థాయికి రావడానికి నాయకుల కంటే ప్రజలే కారణమని స్పష్టం చేశారు.

విజయసాయిరెడ్డి కౌంటర్

వైఎస్ జగన్ వ్యాఖ్యలపై మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎక్స్‌ వేదికగా ఘాటుగా స్పందించారు. తాను ఎవరికీ లొంగలేదని, ఎలాంటి ప్రలోభాలకు గురికాలేదని స్పష్టం చేశారు. భయమే లేకపోవడంతోనే ఎంపీ పదవి, పార్టీని వదిలేశానని తెలిపారు. రాజకీయాలనే పూర్తిగా వీడటానికి ఇదే కారణమని పేర్కొన్నారు. వ్యక్తిగత జీవితం నుంచే విలువలు, విశ్వసనీయతతో ముందుకెళ్లానని అన్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.