- “ప్రేక్షకుల ప్రేమే నాకు గొప్ప బహుమతి” అంటున్న రష్మిక
- ‘ఛావా’లో యేసుబాయి పాత్ర నా కెరీర్‌లో స్పెషల్
సోషల్ మీడియాలో “నేషనల్ క్రష్”గా గుర్తింపు పొందిన రష్మిక మందన్నా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2016లో “కిరిక్ పార్టీ” సినిమా వచ్చినప్పటి నుంచి ఈ ట్యాగ్ తన వెంటే ఉందని, కానీ ఇప్పుడది మరింత ఎదిగిపోయిందని చెప్పింది. “కాలేజీ రోజుల్లోనే నేను మా విభాగానికి క్రష్, తర్వాత కర్ణాటక క్రష్, తర్వాత నేషనల్ క్రష్ అయ్యాను. కానీ ఇప్పుడు ‘ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉన్నావు’ అనే మాట వినడమే నాకు గౌరవంగా అనిపిస్తోంది” అని రష్మిక అన్నారు.
‘ఛావా’లో యేసుబాయి పాత్ర ప్రత్యేకమైనది
ప్రస్తుతం రష్మిక, ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితంపై రూపొందిన “ఛావా” సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. ఫిబ్రవరి 14న విడుదల కానున్న ఈ చిత్రంలో విక్కీ కౌశల్‌తో కలిసి యేసుబాయి పాత్రలో నటించారు. “దక్షిణాది నుండి వచ్చిన నాకొక మహారాష్ట్ర మహారాణి పాత్ర దక్కడం ఆశ్చర్యంగా అనిపించింది. కెరీర్ పరంగా ఇది నాకు చాలా ప్రత్యేకం” అని తెలిపారు. రష్మిక ప్రస్తుతం “కుబేర”, “సికందర్”, “థామా”, “ది గర్ల్‌ఫ్రెండ్”, “రెయిన్ బో” చిత్రాలతో బిజీగా ఉన్నారు. “ఛావా” సినిమాలో నటించడం తన కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందని, ఇలాంటి పాత్ర చేసిన తర్వాత యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పినా ఫర్వాలేదని నవ్వుతూ చెప్పింది.





