- నేరస్తులను పరామర్శించే జగన్కు ప్రజా సమస్యలపై మాట్లాడే నైతికత ఉందా?
- వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామాలు చేయాలని డిమాండ్
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు. నేరస్థులను, దౌర్జన్యాలకు పాల్పడిన వారిని జైలుకు వెళ్లి పరామర్శించే జగన్, అసెంబ్లీలో ప్రజల సమస్యలపై నిలదీయలేకపోతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. అసెంబ్లీని బహిష్కరించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు ప్రజా సమస్యల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన ‘సూపర్ సిక్స్’ పథకాలపై చిత్తశుద్ధి నిరూపించుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. ఈ పథకాల కోసం బడ్జెట్లో గణనీయమైన నిధులు కేటాయించి, ఈ ఏడాది నుంచే అమలు చేయాలని సూచించారు.





