- సమంత మూడు రోజుల పాటు ఫోన్ లేకుండా గడిపిందట!
- మానసిక ప్రశాంతత కోసం మీరు చేయండని అభిమానులకు సూచన
సోషల్ మీడియాలో చురుకుగా ఉండే సమంత, తన మూడు రోజుల మౌనాన్ని గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఫోన్ లేకుండా, ఎవరితో మాట్లాడకుండా గడిపిన ఈ అనుభవం పోస్ట్ వైరల్ అయింది. “ఒంటరిగా ఉండటం చాలా కష్టమైన విషయం, కానీ నేను దాన్ని ఇష్టపడతాను” అని ఆమె తెలిపారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతూ, అభిమానులకు ఇలాంటి అనుభవం పొందాలని సూచించారు. సమంత ప్రస్తుతం ‘రక్త్‌బ్రహ్మాండ్’ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు. ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో కూడా ఆమె కనిపిస్తోంది. ‘సిటడెల్: హనీ బన్నీ’ ప్రమోషన్స్‌లో పాల్గొననున్నారు.





