జీయోటెలీ ఓఎస్ తో థాంమ్సన్ తొలి స్మార్ట్ టీవీలు.. బడ్జెట్ లోనే!

  • JioTele OS పై నడిచే తొలి టీవీగా THOMSON కొత్త ఆవిష్కరణ
  • ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 18,999కే అందుబాటులో!!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ THOMSON, భారతదేశ మార్కెట్ కోసం కొత్తగా 43-ఇంచ్ QLED టీవీని విడుదల చేసింది. ప్రత్యేకత ఏమిటంటే, ఈ టీవీ JioTele OS తో పనిచేస్తుంది. జియో అభివృద్ధి చేసిన భారతదేశపు స్వంత టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ లో రన్ అయ్యే తొలి టీవీ ఇదే కావడం విశేషం. THOMSON ఈ కొత్త మోడల్‌ను జనవరి 21 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ధర రూ. 18,999 గా నిర్ణయించారు. భారతీయ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ JioTele OS, తక్కువ ధరలో అత్యుత్తమ అనుభూతిని అందించేలా తయారైంది.

JioTele OS ప్రాముఖ్యత ఏమిటంటే, ఇది భారతీయ వినియోగదారుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఫాస్ట్, లైట్ వేటు, యూజర్-ఫ్రెండ్లీ ఆపరేటింగ్ సిస్టమ్. ఇందులో AI ఆధారిత కంటెంట్ రికమెండేషన్లు, యూనివర్సల్ వాయిస్ సర్చ్, 200+ యాప్స్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

THOMSON 43-ఇంచ్ QLED టీవీ ఫీచర్లు:

  • QLED డిస్‌ప్లే – 1.1 బిలియన్ రంగులతో అద్భుతమైన కలర్, కాంట్రాస్ట్, క్లారిటీ
  • JioTele OS – తెలుగుతో పాటు 10 భారతీయ భాషల్లో వాయిస్ సర్చ్, OTT యాప్స్, బ్రౌజింగ్
  • స్మార్ట్ కనెక్టివిటీ – వాయిస్ సెర్చ్, స్క్రీన్ మిర్రరింగ్, HDMI, USB పోర్టులు
  • ఇండియన్ కంటెంట్ ఫోకస్ – ప్రముఖ భారతీయ OTT ప్లాట్‌ఫామ్‌ల ముందస్తు యాక్సెస్
  • స్లీక్ డిజైన్ – బెజెల్ లెస్ స్క్రీన్, అల్యూమినియం స్టాండ్‌తో ఆకర్షణీయమైన లుక్

THOMSON – JioTel OS భాగస్వామ్యం

THOMSON, భారతదేశ మార్కెట్ కోసం స్థానికంగా తక్కువ ఖర్చుతో అధునాతన సాంకేతికత అందించడానికి JioTele OS తో పనిచేస్తోంది. ఈ భాగస్వామ్యం ద్వారా భారతీయ వినియోగదారులకు ఆధునిక, సమర్థవంతమైన, స్థానిక అవసరాలకు తగ్గట్లుగా అనువైన స్మార్ట్ టీవీ అనుభవం లభించనుంది. THOMSON CEO అవ్నీత్ సింగ్ మార్వా మాట్లాడుతూ, “భారత వినియోగదారుల కోసం స్థానికంగా అభివృద్ధి చేసిన సాంకేతికతను అందించాలనే లక్ష్యంతోనే JioTele OS తో కలసికట్టుగా పనిచేస్తున్నాం. దీని ద్వారా అధునాతన QLED టీవీలను చౌకగా అందించగలుగుతున్నాం” అన్నారు. Jio హోమ్ డిజిటల్ సర్వీసెస్ అధ్యక్షుడు అనిల్ జయరాజ్ మాట్లాడుతూ, “ఇండియన్ వినియోగదారుల కోసం విప్లవాత్మక టెక్నాలజీని అందించడమే మా లక్ష్యం. THOMSON తో కలిసి JioTele OS ద్వారా స్మార్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ లో కొత్త అధ్యాయాన్ని తెరవబోతున్నాం” అన్నారు.

ధర & లాంచ్ ఆఫర్లు

THOMSON 43-ఇంచ్ QLED టీవీ జనవరి 21 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా అందుబాటులోకి రానుంది. ప్రారంభ ధర రూ. 18,999 మాత్రమే. లాంచ్ సందర్భంగా కొన్ని ప్రత్యేక ఆఫర్లు కూడా ఉన్నాయి:

  • JioHotstar – 3 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్
  • JioSaavn – 3 నెలల ఉచిత సంగీత స్ట్రీమింగ్
  • JioGames – 1 నెల ఉచిత యాక్సెస్
  • Swiggy – రూ. 499 విలువైన ఆర్డర్ పై రూ. 150 తగ్గింపు

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *