- ఫిబ్రవరి 27న ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
- ఏపీ ఎన్నికల వెబ్‌సైట్ ద్వారా ఓటింగ్ వివరాలు చెక్ చేసుకునే అవకాశం
రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఫిబ్రవరి 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగనున్నాయి. ఎన్నికల ప్రణాళిక ప్రకారం, పట్టభద్రుల ఓటర్ల జాబితా సాధారణ అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఓటర్ల జాబితాతో సంబంధం లేకుండా తయారు చేయబడింది. ఓటర్లు తమ వివరాలను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వెబ్‌సైట్లో చూసుకోవచ్చు.
వివరాలు తెలుసుకునే విధానం
ఓటరు తమ పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి గూగుల్ బ్రౌజర్‌లో CEO Andhra Website ఓపెన్ చేయాలి. వెబ్‌సైట్‌లో “ఎమ్మెల్సీ రిజిస్ట్రేషన్ 2024” లింక్‌పై క్లిక్ చేస్తే “సెర్చ్ యువర్ నేమ్” అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ వివరాలు ఎంటర్ చేసి చూడొచ్చు.
- ఐడీ నంబర్ లేదా పేరు, ఇంటి నంబరు నమోదు చేయాలి.
- సబ్‌మిట్ చేసిన వెంటనే ఓటు సీరియల్ నంబర్, పోలింగ్ బూత్ వివరాలు తెలుస్తాయి.
- ఓటు వేసే పోలింగ్ కేంద్రం, గది నంబరు కూడా అందుబాటులో ఉంటుంది.





