ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఘన విజయం!

  • బంగ్లాదేశ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించిన టీమ్‌ఇండియా
  • శుభ్‌మన్ గిల్ అజేయ సెంచరీ, షమీ ఐదు వికెట్లు

దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట అయ్యింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (101) అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. కెరీర్‌లో ఇది అతని 8వ సెంచరీ కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి శతకం కావడం విశేషం.

కెప్టెన్ రోహిత్ శర్మ (41) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, కేఎల్ రాహుల్ (40) గిల్‌కు తోడుగా నిలిచాడు. విరాట్ కోహ్లీ (22), శ్రేయస్ అయ్యర్ (15), అక్షర్ పటేల్ (8) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. అయినప్పటికీ గిల్ – రాహుల్ జోడీ ఐదో వికెట్‌కు 85 పరుగులు జోడించి జట్టును గెలిపించింది. బౌలింగ్‌లో మహ్మద్ షమీ (5/53) అద్భుత ప్రదర్శన చేశాడు. బంగ్లా బ్యాటింగ్‌ను దెబ్బతీసిన షమీ ఐదు కీలక వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ 3, అక్షర్ 2 వికెట్లు తీయడంతో బంగ్లా జట్టు 228 పరుగులకే కుప్పకూలింది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *