ఢిల్లీ అసెంబ్లీలో తొలిసారి మహిళా ప్రతిపక్ష నేతగా అతిషి!!

  • ఢిల్లీ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా ఆప్‌ నేత అతిషి ఎన్నిక
  • మహిళా సీఎంతో మహిళా ప్రతిపక్ష నేతగా తలపడనున్నారు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: ఢిల్లీ మాజీ మంత్రి అతిషి అసెంబ్లీ ప్రతిపక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలో ఈ పదవి చేపట్టిన మొదటి మహిళా నేతగా చరిత్ర సృష్టించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆమె మహిళా సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న బీజేపీ నేతతో ప్రతిష్టాత్మకంగా తలపడనున్నారు. ఆదివారం జరిగిన ఆప్‌ శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యే సంజీవ్ ఝా అతిషి పేరును ప్రతిపాదించగా, ఇతర సభ్యుల మద్దతుతో ఆమెను ప్రతిపక్ష నేతగా ప్రకటించారు. తనను నమ్మి ఈ బాధ్యత అప్పగించినందుకు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు, శాసనసభా పక్షానికి అతిషి కృతజ్ఞతలు తెలిపారు.

బీజేపీ విజయం – ఆప్‌కు కష్టకాలం

ఈ నెల 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలు గెలుచుకొని కాషాయ జెండా ఎగురవేసింది. 27 ఏళ్ల విరామం తర్వాత తొలిసారి బీజేపీ అధికారంలోకి రావడంతో, ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 సీట్లకు పరిమితమైంది. కేజ్రీవాల్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, ప్రజల్లో వ్యతిరేకత ఈ ఫలితాలకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో, గత ఆప్‌ ప్రభుత్వ పనితీరుపై కాగ్ నివేదికను సభలో ప్రవేశపెట్టాలని బీజేపీ నిర్ణయించింది. ప్రతిపక్ష నేతగా అతిషి ఎలాంటి వైఖరి తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.