- భారీ కాయంతో పరిగెత్తలేక ఇబ్బందులు – మామా ఇంజమామ్ తరహాలో అల్లుడు ఇమామ్ రనౌట్
- అక్షర్ పటేల్ డైరెక్ట్ త్రో – క్రికెట్ ఫ్యాన్స్ ట్రోలింగ్
క్రికెట్ చరిత్రలో అత్యధిక సార్లు రనౌట్ అయిన ఆటగాళ్లలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ ముందు వరసలో ఉంటాడు. వికెట్ల మధ్య పరుగెత్తడంలో నైపుణ్యం తక్కువగా ఉండటం, భారీ కాయంతో తడబడటం వల్ల అతను ఎన్నో మ్యాచ్‌ల్లో రనౌటై జట్టుకు సమస్యలు తెచ్చిపెట్టాడు. ఆదివారం భారత్‌తో మ్యాచ్‌లో పాక్ ఓపెనర్ ఇమాముల్ హక్ రనౌట్ కావడంతో, ఫ్యాన్స్‌కు ఇంజమామ్ గుర్తొచ్చాడు. ఇమామ్ ఇంజమామ్ మేనల్లుడు కావడం విశేషం. షార్ట్ కవర్స్ వైపు బంతిని ఆడి నెమ్మదిగా కదిలిన ఇమామ్, అక్షర్ పటేల్ వేసిన డైరెక్ట్ త్రోకు పెవిలియన్ చేరాల్సి వచ్చింది.
సోషల్ మీడియాలో మీమ్స్ వరద
ఈ రనౌట్ అనంతరం “మామా వారసత్వాన్ని అల్లుడు కొనసాగిస్తున్నాడు!” అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి. క్రికెట్ ప్రేమికులు ఇంజమామ్ గత రనౌట్ వీడియోలను షేర్ చేస్తూ, ఇమామ్‌ను సరిపోలుస్తూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.





